Quotes & Status

50 Collection of Best Telegu Quotes for Facebook & WhatsApp | Telegu Status

Telegu is a language originated in India. It holds the privilege as one of the primary languages alongside English, Hindi and Bengali. Telugu is the primary language in the states of Andhra Pradesh, Telangana. Telugu ranks third among the most number of speakers in India and holds the record of being the sixteenth most number of speakers worldwide. As I already discussed the position of Telegu Language in India and How impactful its speakers make. In this post I will share some of the best Telegu Quotes, love quotes in Telegu, Life QUotes in Telegu, Inspirational quotes in Telegu and any more. So stay glued guys. If you like these awesome Telegu quotes then send them and share it with your friends and relatives and let them know of these awesome quotes.

 

Telegu Quotes on Friendship

నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడుతాడు. చక్కని సలహా ఇస్తాడు. కష్టాల్లో ఆదుకుంటాడు.

స్నేహం చెయ్యడానికి ఒకటికి పదిసార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసివస్తే వందసార్లు అలోచించు.

ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరూ మిగలరు.

చెడు వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది

ప్రతి స్నేహం వెనుక కొన్ని స్వీయ ఆసక్తి ఉంటుంది, స్వీయ ప్రయోజనాలు లేకుండా స్నేహం ఉండదు

మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది

మంచివాళ్ళతో స్నేహం చెయ్యి. నిన్నూ వాళ్లలోనే లెక్కిస్తారు.

మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.

శత్రువులను వదుల్చుకోవాలంటే.. వాళ్లను స్నేహితులుగా చేసుకోవడంకన్నా మంచి మార్గం లేదు.

రెండు దేహాలలో ఉండే ఒక ఆత్మ.

స్నేహాన్ని నటించే మోసగాడికన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు.

Happiness Quotes in Telegu

అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు

అనంతమైన ద:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది.

ఆనందం మీ స్వభావం, అది కోరుకోవడం తప్పు కాదు

ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడమే అసలైన జ్ఞానానికి చిహ్నం

ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు.

కష్టాలను జయించడానికి నిస్పృకన్నా చిరునవ్వు బలమైన ఆయుధం.

కొంతమంది ఆనందాన్ని కొనుక్కుంటారు…కొందరు సృష్టించుకుంటారు…..మనుషుల్లో అదే ముఖ్యమైన తేడా

చిరునవ్వుల దరహాసంతో వెలిగిపోయే వారితోనే మీరు స్నేహం చేయండి

నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.

నవ్వడంతో స్వీయ భారం తగ్గిపోతుంది

ప్రతి ఒక్కరిలో మంచీ చెడు రెండూ ఉంటాయి, అయితే మనం ఇతరులలో మంచే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి

ప్రపంచంలో అణ్వస్త్రాలని మించిన ఆయుధం మనకున్న సహనం..! రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం.!

మీ చేతులు పని చేయవచ్చు కానీ మీ మనస్సు ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది నీవు ఎన్నడూ కదిలేవాడివి కాదు

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు

Telegu Quotes on Inspiration

ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి.. కళ్ళకు కమ్మిన మసకలను తొలగిస్తాయి.

ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు

మనం త్వరగా నిద్రలేచినంత మాత్రనా సూర్యుడు ముందుగా ఉదయిచడు.

ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం కృషి చెయ్యి

‘చింత’కు ‘చిత’కూ తేడా సున్నా. చితి నిర్జీవులను కలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది.

అందరినీ నమ్మడం లేదా ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే

అజ్ఞానమే గాఢమైన అంధకారం

అధికార వాంఛ, అసూయ ఈ రెండు విషయాల గురించి జాగ్రత్త వహించండి, ఇవే నాశనానికి మూలకారణాలు

అనంతమైన దు:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది.

అనవసరపు ఆలోచనలను బుర్రలో నుండి ఖాళీ చేయించు; ఒక రూపు, ఆకారం లేకుండా ఉండు.. నీరులా…!

అనుమానం ఎల్లప్పుడూ నేరాన్ని గుర్తుచేస్తుంది

అబద్ధము శక్తిని పొందినంత మాత్రాన, అబద్ధము ఎన్నడూ నిజం కాదు

అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి

ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు

ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది.

ఆరోగ్యవంతుడికి తన పనిలో నమ్మకం ఉంటుంది

ఆలోచనలు ఉద్వేగాలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి

ఆలోచనలు ఉన్నప్పుడే, అది పరధ్యానం.: ఆలోచనలు లేనప్పుడు, అది ధ్యానం

ఆహరం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు

ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.

ఇతరుల మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి

ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు

ఈ దేశపు సౌభాగ్యమంతా యువజనుల చేతిలోనే ఉంది

ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్ధుడవని భావించకు.. నీవు ఏమైనా చేయగలవు..అన్నింటినీ సాధించగలవు

ఈ రోజు మనం అధిక మరియు తక్కువ, ధనిక మరియు పేద,కుల లేదా మతానికి చెందిన అనే వ్యత్యాసాలను తొలగిద్దాం

ఈత వచ్చిన వారు నీటిలో మునిగిపోవడం నిజం కానీ ఒడ్డున నిలబడిన వారు కాదు. కానీ అటువంటి ప్రజలు ఈత నేర్చుకోలేరు !!!

ఈరోజు ఒక చిన్న అబద్దం చెబితే, దాన్ని కప్పిపుచ్చుకొవడానికి రేపు మరో పెద్ద అబద్దం చేప్పవలసిరావచ్చు.

ఉడతను పెంచాను పారిపోయింది, చిలుకను పెంచాను పారిపోయింది, మొక్కను పెంచాను, ప్రస్తుతం అవి రెండూ వచ్చి చేరాయి

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు

ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్దరంగానికి పనికిరాదు.

ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి.

ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు

ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్లీ బయటపడుతుంది.

ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు

ఎప్పుడూ కింద పడకపోవడం కాదు. పడిన ప్రతిసారీ తిరిగిలేవడమే గొప్ప.

ఎవరికీ అవసరములేని వ్యక్తిగా ఒంటరితనము అన్న భావనలో జీవించువాడు అత్యంత పేదవాడు

ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండుసార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే.

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది, కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం

ఏ ఆయుధాలూ వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి.

ఏ దేశంలోనైనా స్వాతంత్ర్యాన్ని సాధించినదీ, నిలబెట్టినదీ, అనంతరం

ఐక్యతలో ఉన్న ప్రాముఖ్యత శాశ్వతమైనది

ఒక అవివేకి యొక్క అన్ని సందేహాలను తొలగించడం కన్నా నిశ్శబ్దంగా ఉండటం మంచిది

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటుంది

ఒక మనిషి విలువ అతను ఇచ్చే దానిలో చూడాలి పొందే దానిలో కాదు

ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు: కానీ ఆ ఆలోచన తన మరణం తర్వాత, వెయ్యిమంది జీవితాల్లో అవతరిస్తుంది

ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అతి త్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు

Quotes on Life in Telegu

అందమే నిజమైన నవ్వు, పరిపూర్ణ అద్దంలో తన ముఖాన్ని చూసేటప్పుడు మాత్రమే

అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజి నీరు ఎంతో సంతృప్తినిస్తుంది

అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం అనుమానం వచ్చినా సరే, యెంతమాత్రం ఉపేక్షించవద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం

అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికం

అన్ని జీవుల యొక్క స్వభావాన్ని మరియు సౌందర్యాన్ని స్వీకరించి మన కరుణను వృద్ధి చేసుకోవడమే

అన్ని పాములు విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం

అపజయాలు తప్పులు కావు, అవి భవిష్యత్తు పాఠాలు

అమూల్యమైన కాలాన్ని సార్థకం చేసుకోవడమే జన్మరహస్యం

ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది.. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది

ఇంద్రియ నిగ్రహం, కార్యసాధన విషయంలో కొంగలా ఉండాలి, మనిషికి నిగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి సాధన చెయ్యకుండా ఏ పనీ సాధించలేమని గ్రహించాలి

ఇక్కడ చీకటి లేదని అజ్ఞానం వుందని భావిస్తున్నాను

ఇతరులను కష్టపెట్టి మనం సుఖపడడం గొప్పతనం అనిపించుకోదు, మనం కష్టపడి ఇతరులను సుఖపెట్టడం గొప్పతనం

ఉత్తమ జీవితానికి మార్గం విజానం, ప్రేరణ, ప్రేమ

ఎవరికి ఎవరూ ఉండకపోవటం అనేది గొప్ప వ్యాధుల్లో ఒకటి

ఎవరూ చూడలేదని తప్పు చేయకు.. అందరూ చూస్తారని అప్పు చేయకు….జీవితంలో రెండూ పెద్ద ముప్పు నీకు…!

ఎవరూ ప్రయత్నం లేకుండా విజయం సాధించలేరు.. విజయం సాధించిన వారి పట్టుదలకు వారి విజయం రుణపడి ఉంది

ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి

ఒంటరితనం మరియు అవాంఛనీయ భావన చాలా భయంకరమైన పేదరికం

ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు.

ఒక గొప్ప పని చేసే ముందు చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం

ఒక చెట్టును గొడ్డలితో నరకడానికి నాకు ఆరు గంటల సమయం ఇవ్వండి మొదటి నాలుగు గంటల కాలాన్ని నేను గొడ్డలిని పదును చేయుటకు ఉపయోగిస్తాను

ఒక పట్టిక, ఒక కుర్చీ, ఒక గిన్నెలో పండ్లు మరియు ఒక వయోలిన్; ఒక మనిషి సంతోషంగా ఉండటానికి ఇంకా ఏమి కావాలి?

ఒక మంచి భార్య, తన భర్తను తన తల్లిలాగే ఉదయo సమయాన సేవ చేయాలి, అతని సోదరి వలె ప్రేమించాలి, మరి రాత్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి

ఒక శరీరం నుండి వెళ్ళే అన్ని చర్యలు మరియు సంఘటనలు భావన సమయంలో నిర్ణయించబడతాయి

ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నాను

ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు

Telegu Quotes on Love

అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని తలపెట్టకు

అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. స్వేచ్ఛను ప్రేమించడమంటే ఇతరుల్ని ఇష్టపడటం.

అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు, చిత్తశుద్ధి ,ఓర్పు,పట్టుదల ఈ మూడూ కార్యసిద్ధికి ఆవస్యకాలు, కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా అత్యావశ్యకం

Also Read :

good night quotes, symbols status, sick status

ఆర్ట్ లేదా కళ అంటే ఏమిటి? మనిషి యొక్క సృజనాత్మక ఆత్మ యొక్క ప్రతిస్పందన

ఎంత ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే జీవించే సామర్థ్యం అంత ఎక్కువగా పెరుగుతుంది.

ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరిచ్చే అందమైన బహుమతి

దేనినైనా ప్రేమతో చేసి చూడండి, అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది

నక్షత్రాలు అగ్ని అని సందేహించు

నా జీవితమంతా నాకు ప్రేమ,ద్వేషం అనే రెండు మార్గాలు ఎదురయ్యాయి. అందులో నేను ప్రేమనే ఎంచుకున్నా,అందుకే మీ ఎదుట నిలబడగలిగాను.

నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు

పేదరికం, వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లి కూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను

ప్రేమ అనేది అంతులేని రహస్యం లాంటిది, దీనికి వివరించడానికి వేరే ఏమీ లేదు

ప్రేమ అనేది దేవుని అసలు రూపం

ప్రేమ ఎల్లప్పుడూ లభించే పండు వంటిది, అది ప్రతి ఒక్కరి వరకూ చేరుకుంటుంది

ప్రేమ కేవలం ప్రేరణ కాదు, అది నిజమును కలిగి ఉంటుంది, ఇది ఒక చట్టం

ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద పవిత్రత

Telegu Motivational Quotes

అందరిపట్ల విధేయత కనపరచండి, కానీ , మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తిoచకండి

అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది.

అన్ని రకాల జ్ఞానాలలోకెల్లా అత్యుత్తమమైనది తనను తాను తెలుసుకోవడం

అన్ని వేళ్లా సింహలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి.

అర్థం చేసుకున్నది వివరించాలి. తెలుసుకున్నది చేయాలి.

అశ్రద్ధ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది

అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే

ఆశ అనేది నడుస్తున్న కల వంటిది.

ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.

ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటె నువ్వు మెరిగ్గా ఉండటానికి ప్రయత్నించు.

ఇతరులకు మనం మేలు చేసి దానిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. మనకు మేలు చేసినవారిని ఎప్పుడు మర్చిపోవద్దు.

ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం.

ఇవ్వడం నేర్చుకో , తీసుకోవడం కాదు… సేవ అలవరచుకో, పెత్తనం కాదు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *